![]() |
![]() |

కుక్కు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ నవ్వులు కురిపించింది. రాకింగ్ రాకేష్ సెట్ లోకి వస్తూనే ఇంప్రెస్ చేసే డైలాగ్ వేసాడు. "స్వర్గం అంటే దేవతలు ఉంటారని అందరికీ తెలుసు. దేవతలకు మించిన దేవకన్య ఒకటి ఉంటుంది చూడండి ఆ దేవకన్య మీరు" అని రాకింగ్ రాకేష్ అనేసరికి జడ్జ్ శ్రీదేవి ఫిదా ఇపోయారు. వైట్ శారీలో నిజంగా సెట్ లో దేవకన్యలా మురిసిపోయారు. "ఇక్కడ ఓకే. ఇక్కడేంటి " అంటూ ఆలీ ముచ్చెర్ల అరుణాని చూపిస్తూ అడిగారు. " యెదవ తెలివితేటలు చూపించుకే" అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ వచ్చింది. వెంటనే రాకేష్ ఆలీ దగ్గరకు వెళ్లి "నీకు దణ్ణం పెడతా ఏదో ఒకటనకుని ఇచ్చా నన్ను ఇరికించకు " అన్నాడు రాకేష్. " నేనే వరస్ట్ అనుకున్నాను.
.webp)
నాకన్నా వారెస్టుగా ఉన్నాడు " అంటూ యాదమ్మ రాజు రాకేష్ మీద కౌంటర్ వేసాడు. " ఈ నిమ్మకాయతో మిమ్మల్ని అందరినీ వశం చేసుకుంటా" అన్నాడు హరి . "వశం అంటే ఏంటి సర్." అన్నాడు ప్రదీప్. "వశం రసం" అన్నాడు యాదమ్మ రాజు . " నేను నీకోసం వచ్చా. రా బాలిక" అంటూ హరి పల్లవి గౌడ దగ్గరకు వెళ్ళాడు. వెంటనే ప్రదీప్ " రా అని నువ్వు వెళ్తావే" అన్నాడు. " ఆమె రాదు కదా అని" అన్నాడు హరి. " అందరికీ మనసుంటే వస్తది మార్గం నేనెక్కడ ఉంటే అదే స్వర్గం" అంటూ పెద్ద డైలాగ్ చెప్పింది గోమతి ప్రియా. పింక్ కలర్ కాస్ట్యూమ్ లో మెరిసిపోయింది. వెంటనే ఆలీ "వ్వావ్ మేనక్కరా? " అన్నారు. " మేనక గారు ఇలా ఉంటారా? " అని రాకేష్ అడిగాడు.
వెంటనే ప్రదీప్ " ఆయనేమైనా వెళ్ళి చూసొచ్చారేంటి?" అన్నాడు. ఇక వెంటనే ఇమ్మానుయేల్ వచ్చాడు. " మా అక్క అనబెల్. నేను చెల్లి బెల్ " అన్నాడు. ఇక శ్రీదేవి ఐతే "ఎంత క్యూట్ గా ఉన్నారంటే " అంటూ తెగ మెచ్చుకుంది. " నేను అందరినీ బొమ్మలో బంధిస్తా డైరెక్ట్‌గా బొమ్మే వచ్చింది" అన్నాడు హరి . "వొద్దు నేనిప్పుడే వచ్చిన సీసాలో " అంటూ కాసేపు స్కిప్పింగ్ రోప్ ఆడుకున్నారు. ఇక రీతూ బ్లాక్ డ్రెస్ మంత్రగత్తెలా వచ్చి " సమస్య కుక్కు విత్ జాతరత్నాలకి ఉన్న సమస్య ఏంటంటే పవన్ని విన్నర్ చేస్తే సమస్య తీరిపోదు" అని చెప్పింది. " "ఇంట్లో ఉన్న సమస్యలు చెప్పకు ఈడ " అంటూ యాదమ్మ రాజు కౌంటర్ వేసాడు.
![]() |
![]() |